అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) // అత్యున్నత // పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) // అత్యున్నత // పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) // అత్యున్నత //Je te louerai أنت حتماً O Jésus, tu nous appelles Pe malurile râurile triste Haqiqat Soʻzlarin Ochgan Құтқардың күнә құрсауынан El que quisiere ser fuerte Finaritra ny olonao, Христианская любовь Иисус Христос мой добрый пастырь
Song not available - connect to internet to try again?