ఆయనే నా సంగీతము - బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతించెదను (2) IIఆయనేII స్తుతుల మద్యలో నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల మొరలు విని (2) దిక్కులేని పిల్లలకు దేవుడాయనే (2) IIఆయనేII ఇద్దరు ముగ్గురు నా నామంబున - ఏకీభవించిన వారి మద్యలోన (2) ఉండెదననిన మనదేవుని (2) కరములు తట్టి నిత్యము స్తుతించెదము (2) IIఆయనేII సృష్టికర్త క్రీస్తు యేసు నామమున - జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) రాకడలో ప్రభుతో నిత్యముందుము (2) మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము (2) IIఆయనేIIМы миры мы творенье ٴبارى تىنىش، الەم ۇيىقتاپ جاتقاندا Неужели настал Слаще вина как сотовый мёд yswʿ ṭfl byt lḥm إلقاء المحبة Ал - Теңир, Ал-Теңир على الصليب رأيتك Гарцгүй мэт газар W niebie wielka radość
Song not available - connect to internet to try again?