ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) // ఆశ్చర్యకరుడు // తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) // ఆశ్చర్యకరుడు // మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) // ఆశ్చర్యకరుడు //Rab biz kime gidelim? Nə gözəl parlayır Ayın, Günəşin Czyż dla innych pożytkiem twe życie Різдвяна Зірка Meıirimińe toly bar álem Uh uh odi il vento Элохим bʿdmạ sạd ạlẓlạm JESUH KA DAWT TAKTAK Веришь ли ты, что на этой земле
Song not available - connect to internet to try again?