ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు ఉందునన్నావు సదాకాలము యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై // ఉన్నావు // మోషేకు తోడై ఉన్నవాడనీవే నీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2) అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే ఆకాశమునుండి ఆహార మిచ్చితివే బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే // ఉన్నావు // సింహాల బోనులో దానియేలుతో ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2) ఐగుప్తునందున యేసేపుకు తోడై ఆశీర్వదించి అధిపతిగ చేసితివే శ్రమలలో నాతోడై వుందనన్నావే // ఉన్నావు // కన్నీటి లోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2) నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే నీ కంటి పాపలా కాపాడు దేవుడవే ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే // ఉన్నావు //Adorar al Cordero Santo مدعو سماوي Адамзатты жараткан Кудайымдын rì gòng yī lún yuè gòng yī lún Екелим Сехерде, Екелим Севгийле إن في القلب حنينا Ha az Úrnak lelke rám száll Engel bringen frohe Kunde يا جميع الأمم И синь подснежника весною
Song not available - connect to internet to try again?