ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) // ఎంత // నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) // ఎంత // చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) // ఎంత //Мое сердце к Иисусу стремится Splendi Eu sunt mic dar Isus Jésus-Christ Teselli Ruh Senor Jehova Еліңнің қамын ойла деп Ҳеч ким ёқдир Сендак تىق۔تىق Či si veľký a či malý
Song not available - connect to internet to try again?