ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు ఆప్తులకన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు // ఓ తల్లి // కాలాలు మారినా కరిగిపోని ప్రేమ - కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ - ముదిమి వచ్చువరకు నిన్నెత్తుకునే ప్రేమ తల్లియైన మరచినా - నిను మరువని ప్రేమ అ.ప. :ప్రేమా - ప్రేమా - ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా - ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ // ఓ తల్లి // పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ - పాపులని త్రోయక దరి జేర్చు ప్రేమ ప్రాణ స్నేహితుడై - ప్రాణమిచ్చిన ప్రేమ పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమా // ఓ తల్లి //Шихина алдар бууг V spôsobe chleba veríme v teba Туғилдинг, эй Раббим Bütün Kalbimle Övgüler Sunacağım hyạ sbḥwạ ạlrb ОБИЧАМ ТЕ ИСУСЕ МОЙ He, Jesosy Tompo soa هيا اهتفوا Rəbb Çobanımdır mənim, möhtac olmaram Tümlükden ýol açýan biri bar
Song not available - connect to internet to try again?