ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిను ప్రేమించేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నిను రక్షించువాడు యేసయ్యేననే సత్యం తెలియునా నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ స్వంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా // ఓ // నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా // ఓ //O Fils de Dieu, mon Sauveur bien-aimé Il me conduit Спаситель наш сошел на землю к нам Rejoice, My Heart, Be Glad and Sing Горы, море и холмы, лес и поле, и цветы أحبك إذ قد سمعت صلاتي ldẖty ạlqṣwy̱ ربي أنت طريقي شهواتي خدتني Модно
Song not available - connect to internet to try again?