ఓ యువతీ యువకా - ఓ యవ్వనుండా యేసుని సిలువ గురుతుందా - యేసుని సిలువ యెరుకుందా దనవంతుడేసు దయనెంచి నీపై - దరిద్రుడాయేను గురుతుందా దాసుని రూపము దోషంబునెంచక - దోసిలొగ్గెను యెరుకుందా IIఓII కత్తులు గుదియలు ఎదనుంచి యూదులు - ఎదిరించిరేసుని గురుతుందా బందించిరేసుని దొంగనుబోలి - దూషించి ఉమివేసిరెరుకుందా IIఓII శిరమునందు ముండ్లను నాటి - శిలువను మోపిరి గురుతుందా వీదుల వెంట వేధించిరేసుని - ఎరయాయె కొరడాలకెదురుందాIIఓII మిట్ట మధ్యాహ్నము కల్వరి గుట్టపై - కొట్టబడె శిలువను గురుతుందా చట్టుబండపై యవ్వన రక్తము - వరదవలె ప్రవహించెరెరుకుందా IIఓII ఏలీ ఏలీ లామా సబక్తాని - ఎలుగెత్తి అరిచేను గురుతుందా బండలు పగుల, కొండలు కదల - బలియాయె ప్రభు యేసు తెలిసిందా IIఓII యవ్వనమందే కాడిని మోయుట - నరునికి మేలని యెరుకుందా యవ్వనమందే యేసుని నమ్మి - సిలువను మోయుట తెలిసిందాIIఓIIلما ولد موسيقي عايز أكرمك พระพร Blessed يسوع املك حياتي Strigă azi inima mea Kelgin Iso Kelgaysan Ыбрайымдын Кудайы биз үчүн кан төккөн Өтөт мезгил, айларым, жылдарым да قاعد على شط الحياه ЁРИИ ТАЪҶИЛӢ
Song not available - connect to internet to try again?