కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె (2) యేసే తోడమ్మా // కన్నీరేలమ్మా // నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా (2) // కన్నీరేలమ్మా // నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) // కన్నీరేలమ్మా //Господь, если солнце зайдёт и холодно станет в душе Как олень ищет пути к ручью живому A Jesucristo quiero llegarme Każdy wiedzieć musi to kyf ạ̉nsy̱ sydy ạlgẖạly Здесь мы слышим голос Бога lys ly mqr Shan-shoraflar Rabbimizga Böyük sıxıntı içində yaşayıram bu dünyada Salmo 115
Song not available - connect to internet to try again?