కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) // కవులకైనా // చెదరిన మనసులకూ శాంతి కృంగిన హృదికీ ఓదార్పు మృత్యు దేహముకూ జీవం బలహీనులకు ఆరోగ్యం (2) పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు మోసపూరిత ఈ లోకంలో ఏ వైద్యునికి సాధ్యము (2) // కవులకైనా // క్షణికమైన అనురాగాలు ఆవిరివంటి ఆప్యాయతలు అవసరాల అభిమానాలు నిలచిపోయే అనుబంధాలు (2) నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం స్వార్ధపూరిత ఈ లోకంలో ఏ మిత్రునికి సాధ్యము (2) // కవులకైనా //İhtiyacım var Rab Su quella croce Jesús de los mortales يسوع نتوجك Grido di vittoria Jesus elsker alle barna Туғилди Исо Где ты ну где ты Кимсəсиз идим, дајаг олдун Сəн Пред Тобой
Song not available - connect to internet to try again?