గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) // గమ్యం చేరాలని // భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో // సాగిపోతున్నాను // అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని // సాగిపోతున్నాను //Dio è la tua forza Среди волнений в житейском море Jericho يا سيدي ها ثقتي Когда Божий мир наполняет сердца Как туманное утро встаёт В той край İsa Durur Kapıda Więc wstań i idź zdrów Yeşil Ağacın Dallarında
Song not available - connect to internet to try again?