జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నీది యేసు నీ నామము సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసు నీ నామము యేసూ అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్నీ శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షకా నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మ్రొక్కెదము // జుంటె // ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించియున్నది ఊహలకందని ఉన్నతమైనది యేసు నీ నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరిని బ్రతికించు జీవము సర్వ కాలములో నివసించు సత్యము యేసు నీ నామము // జుంటె //أنا الرب Верю слышит Бог мольбу Nous venons devant le Seigneur glorieux Każdy może dziś Кто-то сеет I Need Thee Every Hour Гьоркемле Геледжек روح اسكن في المسيح Serca, ręce wasze złączył PadaMu, Yesus, Kami Serahkan
Song not available - connect to internet to try again?