కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) తుప్పు పట్టి
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) తుప్పు పట్టి
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) తుప్పు పట్టి
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) తుప్పు పట్టి
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) తుప్పు పట్టి
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) తుప్పు పట్టి