దేవర నీ - దేవెనలు - ధారళముగను వీరలపై - బాగుగ వేగమె దిగునిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్ = సొంపుగ నింపుగ పెంపగుచు స - హింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్-ఆకరువరకును లోకములో = శోకము లేకయె యేకముగాఁ-బ్రాకటముగను జేకొనుము ఇప్పగిది నెప్పుడును- గొప్పగు ప్రేమతో నొప్పుచు దా= మొప్పిన చొప్పుఁ దప్పకను - మొప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగాఁ = గాపుగఁ బ్రాపుగ దావునుండి - యాపద లన్నియుఁ బాపుచును సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగాఁ=కదలక వదలక ముదమున నీ - పాదము దాపునఁ బాదుకొనన్ మెండుగ భూమండలపు- గండములలో వీరుండగను = తండ్రిగ దండిగ నుండనుండి - వెండియు వానిని ఖండించవే ఇద్దర వీరిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై = శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ వాసిగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని = మా సకలేశ్వర నీ సుతుఁడౌ - యేసుని పేరిటఁబ్రోవు మామేన్مْروڤَكَه كور Tal es la paz День меняет ночь Grande Tu sei ఊహించలేని మేలులతో నింపినా Не просто ждать пришествия Христа Oi pyhä liekki هل يستطيع الرب بي Зажги Свой свет ạ̉nạ sny ṣgẖyr
Song not available - connect to internet to try again?