నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ (2) వెదకి నన్ రక్షించితివి (2) // నా మనో // నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) పొంది నన్ విడిపించితివి (2) // నా మనో // ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా (2) బాధలు శోధనలు శ్రమలలో (2) ఓదార్చి ఆదుకొంటివయా (2) // నా మనో // నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి (2) స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) యుగయుగములు సర్వ యుగములు (2) // నా మనో //أمشي في النور Любовь Ты добра не злопамятна Quando ti vedrò وو اتا، سەنىن ەركىڭدى ىزدەيم Amati Раб, Путларън Гюджюню Кър! FOR EVER WITH THE LORD Издегиле Асман Падышалыгын Otče, Ťa chválim Малки вий деца, елате
Song not available - connect to internet to try again?