నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - (2) నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - (2) ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - (2) ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - (2) ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - (2) అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - (2) ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - (2) లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - (2) ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - (2)ความรักพระองค์ Руки свои СЛАВА НА СПАСИТЕЛЯ 为什么总是哭 ạ̉kẖṭynạ ạ̹ly ạ̹ạlhnạ NA RIAN NUNH THAN BAWIPA أحبك لأنك أحببتني Abba Padre Samoviy taxtini qoldirib Domnul îi iubirea şi mântuirea
Song not available - connect to internet to try again?