నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2) మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా // నీకంటె // కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే (2) బాధించినా స్వస్థపరిచేది నీవే (2) // నీకంటె // అణచబడిన వేళ నా తలను ఎత్తినావే (2) శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) // నీకంటె // విడువబడిన వేళ నను చేరదీసినావే (2) కోపించినా కరుణ చూపేది నీవే (2) // నీకంటె //Şükürlər edirəm, Allahım, Sənə ạ̉ʿlmk wạ̉rsẖdk yswʿ ạ̉nt knzy ạlʿẓym Приди ко Мне обремененный yswʿ mlk ạlmlwk ขอบคุณพระเยซู Egli è esaltato (Yahweh) yạlly ʿrft ạlrb yswʿ Svet sníval Их Эзэнийг би юугаар
Song not available - connect to internet to try again?