నీతో సమమెవరు - నీలా ప్రేమించేదవరు నీలా క్షమియించేదెవరు - యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2) లోక బంగారము - ధన ధాన్యాదులు ఒక పోగేసినా - నీతో సరితూగునా జీవ నదులన్నియు - సర్వ సంద్రములు ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు // నీతో // పలు వేదాలలో - మత గ్రంథాలలో పాపమే సోకని - పరిశుద్దుడేడి పాప పరిహారార్థం - సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు // నీతో // నేను వెదకకున్నా - నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా - నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి - తరచు రేపితిని నన్నెంతో సహించి - క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు // నీతో //МАКТАЛДЫГ КЕЛИР МЕН О неужели Царь вселенной Una vita nuova Más allá de todo pensamiento هيا يا شعب Den sobotní Men jonimning doʻstini angladim شْڤانِه قَنج منقوش على الكفين إلهنا عظيم إلهنا أمين
Song not available - connect to internet to try again?