నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా // నీ ధనము // ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా // నీ ధనము // పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా // నీ ధనము // వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) వెలిగించ ధరపైని ప్రభు నామము కలిమికొలది ప్రభున కర్పింపవా // నీ ధనము // కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలు బాధభరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా // నీ ధనము //yswʿ rby rạʿy Jak będzie nam 主啊求你差遣我 Prosby klíčem jsou Иса Сəн Мəним Һəјатымсан إنت الحياة Generazione appassionata JESUS BIDS UN SHINE Ты навеки моя العمر عمر واحد
Song not available - connect to internet to try again?