నేనంటే నీ కెందుకో ఈ ప్రేమ - నన్ను మరచి పోవెందుకో నా ఊసే నీ కెందుకో ఓ యేసయ్యా - నన్ను విడిచి పోవెందుకో కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో - వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు - ప్రాణమా - నా ప్రాణమా ప్రాణమా - నా ప్రాణమా నిన్ను మరచిపోయినా - నన్ను మరచిపోలేవు నిన్ను విడచి వెళ్ళినా - నన్ను వీడి పోలేవు ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా // 4 // ఏఋణమో ఈబంధము నా ప్రేమమూర్తి తాళలేను-నీ ప్రేమను // నేనంటే // ప్రార్థించక పోయినా - పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయిన కలవరిస్తూ ఉంటావు // 2 // ఎందుకింత జాలి నాపై యేసయ్యా // 4 // ఏ ఫలమో - ఈ బంధమూ - నా ప్రేమ మూర్తి తాళలేను - నీ ప్రేమను // నేనంటే //Cet air que je respire Ісус, Твоя Кров Zbawiciel idzie uwielbić nas Slnko Kristovej Lásky ạnạ ạsmy hbẗ Кристалл Padre Ğussə pure çımı ım dıl Никогда на земле не бывает Duchu Svätý, príď z neba
Song not available - connect to internet to try again?