ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2) ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) // ప్రియమైన // జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) // నా ప్రియుడా // ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) // నా ప్రియుడా // ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) // నా ప్రియుడా //lmạ ạlrb yswʿ Вот с тимпанами в руках Bajo sus alas habito seguro He, Jesosy Tomponao అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న tʿạla yạ fạdynạ Это есть день Kelińder Sábıge, adal júrekpen Омой меня Своею Кровью Святой Я хвалу Тебе пою, Иса
Song not available - connect to internet to try again?