ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ // ప్రేమ // తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును // ఎన్నడెన్నడు // భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును // ఎన్నడెన్నడు // బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును // ఎన్నడెన్నడు // ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును // ఎన్నడెన్నడు //ТВОЙТА ВОЛЯ ТЪРСЯ, БОЖЕ Блажен кто молиться умеет Jerusalem the Golden Qadim Zamonda De heladas cordilleras Ты воскрес Holy Freedom Тэнгэр дэх нар сарнууд аа حب كتير السهرية Mba tarihonao Tompo o izahay
Song not available - connect to internet to try again?