బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2) చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా (2) // బ్రతకాలని // కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఎకాకినైతి గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా (2) // బ్రతకాలని // నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం చుక్కాని లేని నావనైతి గమ్యం తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా (2) // బ్రతకాలని //مين زيك يا إله المجد Эй солеҳон, дар Худо шодӣ намоед Fin dall'eternità این سرزمین خانۀ منست Построенный Христом أمامك يا سيدي blạk ạlʿysẖẗ ṣʿbẗ rby tsbyḥ qlby Tanrı'nın Lütfu Lámej mi, Ježíši
Song not available - connect to internet to try again?