భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును (2) వృజినములపై జయము నిచ్చిన (2) విజయుడా నిను వేడుకొందు // భజన // దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు (2) భవ్యమైన బోధలెన్నో (2) బాగుగా ధర నేర్పినావు // భజన // నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు (2) పరుడ నైన నా కొరకు నీ (2) ప్రాణము నర్పించినావు // భజన // చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు (2) పడిన నాడు గోతి నుండి (2) పైకి లేవనెత్తి నావు // భజన // ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు (2) ఇంతయని వర్ణింప నిలలో (2) నెవనికిని సాధ్యంబు కాదు // భజన //Gereja Bagai Bahtera Jésus-Christ seul demeure В доме любящих Меня, меня били и распяли. VANCUNG MEMBER KAN SI msbtnysẖ Бизниң Худа Odložil si svoj majestát mjdaⁿạ lạsmh О Предвечный Дух Ты к нам приди Ary an-koatra ary ilay Paradisa soa
Song not available - connect to internet to try again?