భీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే IIభీకరుండౌII మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము IIభీకరుండౌII ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా - దైవమని పూజింతుము IభీకరుండౌII పుట్టగిట్టన్ జేయ దానై - నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా - ప్రస్తుతింపరే భక్తిని IభీకరుండౌII మేటి సంగీతంబులపై - మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను IIభీకరుండౌII మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు - దిరుగ జేర్పన్ మందను IIభీకరుండౌIIDe la boca de los niños Верить,надеяться,любить Niciodată, niciodată, înapoi să nu priveşti mó xī ài mín rú zi Uncreated One İman Edip Rab'be Geldim, Kararımı Ben Verdim المحبة nʿẓm ạlrb yswʿ Ampianaro aho, Tompo, mba hiambina A lui la majesté
Song not available - connect to internet to try again?