మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా అ.ప.:నా మది నీ కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీనమనస్సుతో నీకడ శిరము వంచితి పూర్ణశాంతిగల వానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమాTe exaltamos sobre un trono ٴبارىمىز بىرگە اكەمىزدىڭ ۇيىندە Сенсиз Ъшъъм Йок Гайхамшигт загалмай Məsihsiz bu dünyada yaşamaq çətin Родился Иисус и приблизился Бог Your Love Is Beautiful Yalnız Sen Mi Vida Di Por Ti Вифезда - купальня Твоя,
Song not available - connect to internet to try again?