యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) // యెహోవా // నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) విడువక నను ఎడబాయని దేవా (2) // యెహోవా // మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) ఆదరెను ధరణి భయకంపముచే (2) // యెహోవా // నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) // యెహోవా // పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను (2) తన నోటనుండి వచ్చిన అగ్ని (2) దహించివేసెను వైరులనెల్లన్ (2) // యెహోవా // మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును (2) ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2) అపజయమిచ్చును అపవాదికిని (2) // యెహోవా // దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును (2) గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2) సర్వమునెరిగిన సర్వాధికారి (2) // యెహోవా // నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2) రక్షణ కేడెము నాకందించి (2) అక్షయముగ తన పక్షము జేర్చిన (2) // యెహోవా // యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2) అన్యజనులలో ధన్యత చూపుచు (2) హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) // యెహోవా //أروم Jezus Chrystus jest Panem Mesih'im ما دمت ربى في الطريق Ты даешь мне милость La soluzione Шюкредийорум Jak zní mile jméno Ježíš Sciuscià (Basta viver) L'eccellenza dell'amore
Song not available - connect to internet to try again?