రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) // రుచి చూచి // గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే(2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) // రుచి చూచి // మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) // రుచి చూచి // మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) // రుచి చూచి // కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) // రుచి చూచి // ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి(2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) // రుచి చూచి //O, wiem ja w kogo wierzę Отец Небесный воздаятель Pane, Ty si nám nehodným Herra Sä taivaan Kyrie Чудный прекрасный брачный день بيطمني كلامك Khen Lohna Vangkhaw Lun Смотри какую любовь нам дал Bu həyat çox iztirablıdır
Song not available - connect to internet to try again?