రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా (2) పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) సూర్యుడుండడు చంద్రుడుండడు చీకటుండదు రాత్రియుండదు నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) // రెండే // పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం (2) అగ్ని ఆరదు పురుగు చావదు గప్పగప్పున రగులుచుండును ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) // రెండే // పుడతావు నీవు దిగంబరిగా వెళతావు నీవు దిగంబరిగా (2) గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) // రెండే //داڭق اعا بئزدىن پادىشاعا! ndkẖl ạ̉bwạbh bḥmd ДА И АМИН mṣdq ạkẖtbrny yạ ạllh Jen vzývej Boha Буцалтгүйгээр 虽是隔着山 Исо, чӣ хел номи зебо mạdmt mʿy
Song not available - connect to internet to try again?