రోజంతా నీ పాద చెంత నేనుండ నా కోరిక దినమెల్ల నా తోడుగా నీవుంటే ఓ వేడుక నిను చూసే కనులు స్తుతించే గళము ప్రేమించే హృదయము స్పందించే మనసు దేవా నీవే దయచేయుము నిన్ను కీర్తింప నేర్పు ప్రభు (2) జీవితాంతము నీ వాడిగానే నేనుండ నా కోరిక ప్రతి నిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలిక // రోజంతా // నీ సైనికుడనై నే పోరాడెదను నా శక్తంతయు నా యుక్తంతయు నీకై వెచ్చింప సంసిద్ధుడను నన్ను దీవింప పంపు ప్రభూ (2) అతి త్వరలో జనులెల్లరు నిన్నెరుగ నా కోరిక ఒకమారు వారందరును నిను పొగడ చూడాలిగా // రోజంతా //О, бенде канат олсайдъ ạlly ṣạnʿny hw Joie dans le monde Vigilia Sa-l sarbatorim sa-i cantam cu toti Oi Jeesus, sanas ääreen Радость в Господе - сила моя yạlly bdyt ạlrḥlẗ mʿạyạ Blúdim a ty o tom vieš دعوتني
Song not available - connect to internet to try again?