లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ... ఇదియే భాగ్యమూ... ఇదియే నా భాగ్యమూ // లెమ్ము // శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి (2) ఇదియే ధన్యత.... ఇదియే ధన్యత.... ఇదియే నా ధన్యత // లెమ్ము // తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము (2) తేజోమయమైన షాలోము నగరులో నిను చూసి తరింతునే (2) ఇదియే దర్శనము... ఇదియే దర్శనము... ఇదియే నా దర్శనము // లెమ్ము //Твоя любовь Chantons d'un cœur joyeux Sono qui per adorare ที่แท่นบูชา اق باتاڭ قونسىن جەرىمە، ويانۋ كەلسىن ەلىمە! تعال غير حياتي Marana-Tha О, как да го не любя قرب ييجي اليوم يارب ما أكثر مضايقينا
Song not available - connect to internet to try again?