వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో // వందనం // ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో // వందనం // ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా // వందనం // దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా // వందనం // కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా // వందనం //Niebezpieczny to stan Нұры әлемнің Cuán glorioso es el cambio Жан дилимди Сага арнаймын KHRIHFA RALKAP KAL U Оттуу жайытка мени жаясың Гуноҳҳои маро Худо бахшид ạsạ̉lny ạ̉ʿṭy ạlạ̉mm Жер мен аспан, таусылмас көп дастан Эң жогорку Кудай
Song not available - connect to internet to try again?