సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు.... మహిమలో స్ధానమిచ్చినావు.... నాలో. . . . నిన్ను చూసావు.... నీలో. . . . నన్ను దాచావు.... నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ // సృష్టికర్తవైన యెహోవా // ఏ కాంతిలేని నిశిధిలో ఏ తోడు లేని విషాదపు విధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్నాతండ్రివి (2) యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) // సృష్టికర్తవైన యెహోవా // నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి (2) // సృష్టికర్తవైన యెహోవా //Сәнсиз бу дунияда өмүр йоқтур С нами Бог кто будет против нас rby fy ḥḍnk rwḥy بين السكوت ليس للحب الذي أظهرت إني لا أعلم بعدما ساد الظلام Mba ampio, ry Tompo soa ىشەنىپ كەلەم، تەڭىرىم ىيسا قصة الحب
Song not available - connect to internet to try again?