స్తోత్రము సేయరే - సోదరులారా మనాత్మలతో తండ్రిన్ ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి // స్తోత్ర // మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకను త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో // స్తోత్ర // ఇచ్చట ప్రేమల కిదియే కడవరి - వచ్చియున్నదేమో యచ్చట మనమందరము గలిసికొని - యానందింతుముగా // స్తోత్ర // ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము- లక్కడ మనమంత మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు - మొక్క మనసుతోను // స్తోత్ర // కన్నీరుండదు - చావు కష్టము - లెన్నిటి కండవుగా పన్నుగ మన శృం-గారపు బ్రతుకు - లెన్న కండవుగా // స్తోత్ర // మ్రోగును వీణెలు - సాగును పాటులు- సతతముగా నచట రాగము లెంతో రమ్మమైన యుండన్ - బాగింతనలేము // స్తోత్ర // గొఱ్ఱెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది అందుముగా గరుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగా // స్తోత్ర //يا الله إِلهي أنت నన్ను కావగ వచ్చిన నజరేయ యేసయ్యా ạ̉ḥbk mʿny̱ kl wjwd Cristo (Cristo) te amo Il mio cuore ama Dünya denen bu çölde Mi soccorri sempre Пеньем восторженным славим мы Господа ạmwr ktyr Uit: Ek wil U loof
Song not available - connect to internet to try again?