ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై యున్ననీ కృపయే ఆధారం ఆశ్రయము - నా ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్ని బంధువులైనా // ఆ // భక్తి హీన బంధంలో నేనుండగా (2) శ్రమల సంద్రంలో పడియుండగా (2) యిరుకులో, విశాలతను, కలిగించిన దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా // ఆ // దారిద్య్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి (2) నీ స్వరమే నావరమై నడిపించిన యేసయ్యా (2) విడువను, ఎడబాయనని పలికిన నాదేవా (2) నీ చల్లని ఒడిలో నను చేర్చగరావా // ఆ // దిగులు పడిన వేళలో దరిచేరిన దేవా (2) అవమానపు చీకటిలో బలమిచ్చిన నాదేవా (2) చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నాదేవా (2) నీ చల్లని ఒడిలో నను చేర్చగరావా // ఆ //Ясън Провідна зірка Nawróć się, nawróć się Булут үстүндө келет менин Теңирим Сделай сердце мне بيكي أمجاد يا مدينة الله ప్రార్ధన వినెడి పావనుడా Ogni parte di me إختبارات المؤمنين Да будет Свет
Song not available - connect to internet to try again?