ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) // ఆశ్చర్యమైన // పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే // ఆశ్చర్యమైన // పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే // ఆశ్చర్యమైన // శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు // ఆశ్చర్యమైన // నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే // ఆశ్చర్యమైన //Ce la farò Yollarını Öğret ხალხი დაეძებს თავის გმირებს Ва саҳни қудсат Задумайся друг на жизнь посмотри Eu n-am nimic de preț pe lume 我们带着天上的异象 ەلىم۔اي Ó, jöjj, ó, jöjj, Emmánuel lst ạ̉dry
Song not available - connect to internet to try again?