ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాళిపంట సాతానుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా మంచి వారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కనరాదే మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా // ఉన్నత // ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే గుణహీనుడైన మానవుని ఋణము చెల్లించదలిచావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా // ఉన్నత // పొరుగువాడు కలిగున్నదానిని ఆశించుటయే తప్ప ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా // ఉన్నత //Словно пазлы lmsny yswʿ Il grido di El Shaddai Missionary Anthem sẖkraⁿạ mn kl ạlqlb Хатсан яс Доживу до последней стужи باصلي يا ربي بكل خشوع ربي بالروح املاني Виновны мы перед Тобой, Господь,
Song not available - connect to internet to try again?