ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా // ఎన్ని // నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా // ఎన్ని // ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా // ఎన్ని // నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా // ఎన్ని //mn ḥwl mạỷdtk Бурадайъм உங்க நாமம் உயரணும் في بحار حبك yswʿ ạnt rby ʿzyzy ạlạ̉myn sẖfạʾ wmjd wḥryẗ NƏ GÖZƏLDİR İMAN ETMƏK mwsyqy̱ قد تتبعت خطاك Не гюзел бахчениз вар
Song not available - connect to internet to try again?