ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము // ఎవరైనా // అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా నీచుడనని చూడకుండా నాకోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము // ఎవరైనా // స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నాకోసము ఉన్నందతా ఇచ్చినాడు ఏమి త్యాగము // ఎవరైనా //The Day is Surely Drawing Near Севги, Севги Асла Зевал Булмаз Je m'approche de toi kạn ʿạysẖ zynạ أحمدك يارب في الأمم sddt ạldyn ʿny La croix reste debout Der Herr segne dich Nebeský Bože ạ̉nt llsẖfạh
Song not available - connect to internet to try again?