ఏ పాపమెరుగని - యో పావన మూర్తి - పాప విమోచకుండ నా పాలిదైవమా - నా పాపముల కొర - కీపాట్లు నొందినావా ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా కలువరిగిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా సిలువ నీతో మోయ - దులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా చెడుగు యూదులు బెట్టు - పడరానిపాట్లకు - సుడివడి నడిచినావా కడకు కల్వరిగిరి - కడకేగి సిల్వను - గ్రక్కున దించినావా ఆ కాలకర్ములు - భీకరంబుగ నిన్ను - యా కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా పలు విధంబుల శ్రమలు - చెలరేగ దండ్రికి - నెలుగెత్తిమొరలిడితివా సిలువపై బలుమారు - కలుగుచుండెడి బాధ - వలనదాహమునాయెనా బల్లిదుండగుబంటు - బల్లెమున నీ ప్రక్క - జిల్లబడ బొడిచినాడా ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ - జల్లారెగదె కోపము కటకటా పాపసం - కటము బాపుటకింత - పలు బాధనొందినావా ఎటువంటిదీ ప్రేమ - ఎటువంటిదీ శాంత - మెటులవర్ణింతు స్వామి弟兄你又起程 fú shì dì xiōng zhōng zuì xiǎo de De La Iglesia El Fundamento НЕ, НЕ МОГА ДА СПРА ДА ТЕ ХВАЛЯ Успеть сказать Люблю Confido in Te కొంతసేపు కనబడి msyḥnạ hw ạllh Среди Шторма Благ Господь каждый день
Song not available - connect to internet to try again?