ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) ఒక్కరినైనా ఒక ఆత్మనైనా (2) రక్షించానా నీకై వెలిగించానా // ఏం చేసానయ్యా // ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా (2) ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) // ఏం చేసానయ్యా // ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా (2) // ఇప్పటికైనా // ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా (2) // ఇప్పటికైనా //gẖyrt ạ̉gẖsṭyn Uyanış Yılı يسوع ملك الملوك ạ̉ḥbk fḥbk Chceme chváliť Tvorcu všetkého سەنى داڭقتايم، تەڭىر، سىيىنعانىمدا دي حياة جديدة Дарите друг другу любовь kmạ yfjr ạlnbʿ Sakaiza, raha tia
Song not available - connect to internet to try again?