ఓ యువతీ యువకా - ఓ యవ్వనుండా యేసుని సిలువ గురుతుందా - యేసుని సిలువ యెరుకుందా దనవంతుడేసు దయనెంచి నీపై - దరిద్రుడాయేను గురుతుందా దాసుని రూపము దోషంబునెంచక - దోసిలొగ్గెను యెరుకుందా IIఓII కత్తులు గుదియలు ఎదనుంచి యూదులు - ఎదిరించిరేసుని గురుతుందా బందించిరేసుని దొంగనుబోలి - దూషించి ఉమివేసిరెరుకుందా IIఓII శిరమునందు ముండ్లను నాటి - శిలువను మోపిరి గురుతుందా వీదుల వెంట వేధించిరేసుని - ఎరయాయె కొరడాలకెదురుందాIIఓII మిట్ట మధ్యాహ్నము కల్వరి గుట్టపై - కొట్టబడె శిలువను గురుతుందా చట్టుబండపై యవ్వన రక్తము - వరదవలె ప్రవహించెరెరుకుందా IIఓII ఏలీ ఏలీ లామా సబక్తాని - ఎలుగెత్తి అరిచేను గురుతుందా బండలు పగుల, కొండలు కదల - బలియాయె ప్రభు యేసు తెలిసిందా IIఓII యవ్వనమందే కాడిని మోయుట - నరునికి మేలని యెరుకుందా యవ్వనమందే యేసుని నమ్మి - సిలువను మోయుట తెలిసిందాIIఓIIAssetato di te Our Father Masih Xudoning qiyofasida boʻla turib Մեծ ես Դու,Ով Մեր Հայր Jeg fant Dine ord og jeg åt dem Я люблю размышлять yạlly mt bdạly Güçlü kule ადიდე სულო ჩემო უფალი వందనము నీకే నా వందనము
Song not available - connect to internet to try again?