కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళ ఎటుతోచక లోలోన నే కృంగియున్న వేళ అ.ప:నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా పనిపూర్తి చేయగా బలములేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసూ తొలగించావు శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా చెదిరిపోయి ఆశలసౌధం నా గొంతు మూగబోగా స్తుతిపాట పాడగా స్వరము రానివేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతనగీతం యేసూ పలికించావు కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా అడుగేసి సాగగా అనువుగాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావుУстало сердце ноют ноги Кьор гьоркемини гьорюйор Jeg er barn Käy, armahtaja laupias Tüm Gökyüzü Ты тверже алмаза и крепче гранита దేహం పాతది Seni Gördüler! Uno in più Церковь проснись
Song not available - connect to internet to try again?