కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) // కళ్ళల్లో // హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక // కళ్ళల్లో // కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2) యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక యేసే విమోచకా - సంతసించుము నీవిక // కళ్ళల్లో //O, Iysa Махаббатың қандай ғажап To The Highest Place Oting Seni Muqaddas Vagaba yo en el error Le mani battiamo Vorbeşte-ne Isuse cu dulcele Tău glas Voglio fare la tua volontà Պարզած Ձեռքերս Դեպի Քեզ Golgoty to szczyt
Song not available - connect to internet to try again?