గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) // గమ్యం చేరాలని // భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో // సాగిపోతున్నాను // అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని // సాగిపోతున్నాను //brkḍlk Pozri Boh sám Kalvari Tang Chung Ah Аллах Конушур Кенди Халкъна, Халелуя! 나의영혼이잠잠히 Padáme na svoju tvár Ey Hemû Miletan Турам Мен эшик алдында О, да бях с крила 不要问我
Song not available - connect to internet to try again?