చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి // చింత లేదిక // చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి // చింత లేదిక // కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై // చింత లేదిక // పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము // చింత లేదిక //Volti solitari Ийем биргемиз Запоют акафист соловьи Quiero ver a Jesucristo La majesté de ton nom Gdybym świat pozyskał w życiu moim พระเจ้าของฉันแสนดี My God Is A Good God Jöjj, itt az idő Yo Vencere Гэрэл гэгээ - Stepping Stones Worship
Song not available - connect to internet to try again?