చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక - చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను జాచుచు గరములు - చక్కగా నీవైపు // చూచు // మేమరులమై యుంటిమి మార్గము వీడి - మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి // చూచు // నిను నమ్ము పాపులకు వారెవరైనా - నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు - ఘనమైన నీ కృప // చూచు // నీ భయము మాయెదలను నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము - వైభవ మొందుచు నే భయము లేకుండ - నీ భువిని గొన్నాళ్ళు // చూచు // దయ జూచి మము నెప్పుడు మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి - దయచేయుమని కోర దయ జూపి మన్నించు - దయగల మా తండ్రి // చూచు //Bendecire Al Senor The circuit rider preacher Jésus-Christ est Seigneur لا لن أرى حبًّا Син бөек Аллам! كۉندۅن، ايدان، باردىق جەردەن قلبي دايماً يفرح fy mlʾ ạlzmạn ạ̹smʿwạ mny ạlḥkạyẗ Косари на лугу размахались острыми косами
Song not available - connect to internet to try again?