జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2) జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా (2) // జుంటి తేనె // యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) // జుంటి తేనె // యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2) నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) // జుంటి తేనె // యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి (2) నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) // జుంటి తేనె //Зима ạ̹ly̱ djy̱ ạlḍryḥ Misericordias Domini Adjunk hálát az Úrnak Gəl Rəbb İsa Gəl Un grido d'amore sạkt lyh ... rnm wyạnạ Ела, нека да хвалим Бога 我们要赞美你我主 Are You Washed
Song not available - connect to internet to try again?