దవలవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతిప్రియుడా అతి కాంక్షనీయుడా (2) ఎందుకయ్యా మాపై ప్రేమ ఎందుకయ్యా మాపై కరుణ (2) ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసినా అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా (2) నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను (2) గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా (2) నీ రక్తములో నను కడిగి నీ స్వారూపము నాకిచ్చితివా (2) అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి (2) నీ సేవలో నను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి (2) // దవలవర్ణుడా //Oui, ton amour تەڭىرىم، ۅزۉڭ كەلدىڭ، قايعىعا چۅككۅنۉمدۅ. ОСАННА zhǔ a qiú nǐ chà qiǎn wǒ Мы к Тебе воззовём Di Pagi Hari Yang Sunyi Sıyn syn saǵaty kelgende صار على الأرض Ten déšť jsi Ty تأمل 4
Song not available - connect to internet to try again?