దారి తప్పి పోతున్నావా విశ్వాసి తీరమేదో గమనించావా విశ్వాసి (2) ఈ లోకం ముళ్ళ బాట విశ్రాంతి లేని చోట (2) యేసయ్యే జీవపు బాట సాగిపో ఆయన వెంట (2) యేసుతో నీవొస్తావా విశ్వాసి లోకం విడిచి రానంటావా విశ్వాసి (2) // దారి // ఓడలోని నల్ల కాకి చూడ నేర్చే ఈ లోకాన్ని (2) చూడ చూడ లోకపు రుచి ఓడ మరచిపోయే కాకి (2) కాకిలా నీవుంటావా విశ్వాసి పావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2) // దారి // ఓడలోనున్ననాడు యేసు నీకు తోడుంటాడు (2) ఆశ్రయంబుగా ఉంటాడు ఆశలన్నీ తీరుస్తాడు (2) యేసులో నీవుంటావా విశ్వాసి సంఘమందు చేరుంటావా విశ్వాసి (2) // దారి //Sono fondata in te zhǔ ràng wǒ men bēn pǎo de shí hòu Jak pěkně svítí denice Отче, я люблю присутствие Твоё If We've Ever Needed You Fenségednél nincs vonzóbb Да и Аминь Իմ ժողովուրդը,եթե สาธุการพระนาม Glorify Your Name Du Rocher de Jacob
Song not available - connect to internet to try again?